Weather : ఆంధ్రప్రదేశ్, యానంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన.. సముద్రమట్టంకు 0.9 కి. మీ. ఎత్తున ద్రోణి

Weather report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియచేశారు...

Weather  : ఆంధ్రప్రదేశ్, యానంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన.. సముద్రమట్టంకు 0.9  కి. మీ. ఎత్తున ద్రోణి
Weather

Updated on: Apr 24, 2021 | 4:21 PM

Weather report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియచేశారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు.. ఎల్లుండి, ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి, ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, రేపు.. ఎల్లుండి ప్రధానంగా సీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాఉండగా, ఉత్తర – దక్షిణ ద్రోణి.. మరట్వాడా నుండి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ , రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టంనకు 0.9 కి. మీ. ఎత్తున ఉంది. దక్షిణ ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి 1.5km ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది.

Read also : Vijayawada Covid : బతికున్నారో లేదో తెలీని పరిస్థితి, కుటుంబ సభ్యులకు నో ఇన్ఫర్మేషన్, మార్చరీలో పేరుకుపొతోన్న మృతదేహాలు