AP Weather: ఏపీకి అల్పపీడనం ముప్పు.. ఆ ప్రాంతాలకు వర్షసూచన చేసిన వాతావరణ శాఖ

|

Nov 15, 2022 | 1:44 PM

ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌లు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరో అల్పపీడనం ముప్పు ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

AP Weather: ఏపీకి అల్పపీడనం ముప్పు.. ఆ ప్రాంతాలకు వర్షసూచన చేసిన వాతావరణ శాఖ
Andhra Pradesh Weather Report
Follow us on

దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద నవంబర్, 16 వ తేదీన అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. క్రమంగా నవంబర్ 18వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :—

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఈ రోజు, రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈ రోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..