AP Government: థర్డ్‌వేవ్‌ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. వృద్ధులకు ఆధార్‌ లేకున్నా వ్యాక్సిన్‌

|

Jun 10, 2021 | 4:15 PM

AP Government: గత ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ కొనసాగుతుండగా, థర్డ్‌వేవ్‌,..

AP Government: థర్డ్‌వేవ్‌ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. వృద్ధులకు ఆధార్‌ లేకున్నా వ్యాక్సిన్‌
Follow us on

AP Government: గత ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ కొనసాగుతుండగా, థర్డ్‌వేవ్‌, మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే పరిశోధకులు తెలిపిన విషయం తెలిసిందే. ఇక కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు వివరాలను ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. పీజీ మెడికల్‌ విద్యార్థుల సేవలకు భవిష్యత్తులో వెయిటేజీ ఇస్తామని తెలిపింది. ఇప్పటి వరకు 1955 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సుమారు 1300 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.

థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టులో ప్రభుత్వం దీనిపై మెమో దాఖలు చేసింది.

ఇవీ కూడా చదవండి:

Covid Vaccine 24/7: ఆర్థిక పురోగతిని పరుగెత్తించాలంటే 24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ కొత్త ప్రతిపాదన

Covid 19 Guidelines: ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అక్కర్లేదు.! కేంద్రం నూతన మార్గదర్శకాలు.. వివరాలు..