Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద.. సంగమేశ్వరాలయంను చుట్టుముట్టిన కృష్ణమ్మ..

Srisailam Reservoir: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది.

Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద.. సంగమేశ్వరాలయంను చుట్టుముట్టిన కృష్ణమ్మ..
Srisailam

Updated on: Jul 20, 2021 | 9:30 AM

Srisailam Reservoir: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం కృష్ణా నదిలో వచ్చి చేరుతోంది. దాంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో.. కర్నూలులోని శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పెరిగింది. ఫలితంగా రిజర్వాయర్ పరిధిలో ఉన్న సంగమేశ్వరాలంను కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 833 అడుగులుగా ఉంది. ఈ నీటి మట్టం 840 అడుగులకు చేరినట్లయితే.. సప్తపదీ సంగమం సంగమేశ్వర ఆలయంలోకి కృష్ణా నీళ్లు పూర్తిస్థాయిలో ప్రవేశిస్తాయి. ఇవాళ రాత్రి లోపు కృష్ణా జలాలు సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఏకాదశి పండుగ రోజున ప్రత్యేక పూజల అనంతరం సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలోకి వెళ్తుండటం విశేషం.

ఇదిలాఉంటే.. గత రెండు రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీరు కృష్ణా నదిలో వచ్చి చేరుతోంది. దాంతో కృష్ణా నది ప్రవాహం పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే.. మరో రెండు రోజుల్లో రిజర్వాయర్ నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also read:

Tholi Ekadasi 2021: నేడు తొలి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

Karthika Deepam: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత

IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!