Andhra Pradesh: అనకాపల్లిలో హడలెత్తించిన కింగ్ కోబ్రా.. ఎంత పొడవుందో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..!

|

Nov 26, 2022 | 1:17 PM

అనకాపల్లి జిల్లాలో కింగ్‌ కోబ్రా హడలెత్తించింది. బుసలు కొడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అడవుల్లో మాత్రమే ఉండే కింగ్‌ కోబ్రా ఇక్కడికెలా వచ్చింది? అనేది సందేహంగా నిలిచింది. కింగ్‌ కోబ్రా..

Andhra Pradesh: అనకాపల్లిలో హడలెత్తించిన కింగ్ కోబ్రా.. ఎంత పొడవుందో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..!
King Cobra
Follow us on

అనకాపల్లి జిల్లాలో కింగ్‌ కోబ్రా హడలెత్తించింది. బుసలు కొడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అడవుల్లో మాత్రమే ఉండే కింగ్‌ కోబ్రా ఇక్కడికెలా వచ్చింది? అనేది సందేహంగా నిలిచింది. కింగ్‌ కోబ్రా.. చూస్తేనే కాదు, ఈ పేరు వింటేనే గుండెలు ఝల్లుమంటాయ్‌. అంత భయకరంగా ఉంటుందీ గిరినాగు. అత్యంత విషపూరితమైన ఈ నల్లత్రాచును చూశామంటే గుండెల్లో దడ పుట్టడం ఖాయం. అలాంటిది, కళ్ల ముందుకొచ్చి బుసలు కొడితే పరిస్థితి ఏంటి?. అనకాపల్లి జిల్లాలో అదే జరిగింది. పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతుకు అలాంటి పరిస్థితే ఎదురైంది. వి.మాడుగుల మండలం పాలగడ్డలో పది అడుగులు కింగ్‌ కోబ్రా హడలెత్తించింది. పొలంలో బుసలు కొడుతూ కనిపించడంతో భయంతో వణికిపోయాడు రైతు జగ్గారావు. అక్కడ్నుంచి గ్రామంలోకి పరుగులు పెట్టాడు.

రైతు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్‌.. అతికష్టంమీద కింగ్‌ కోబ్రాను పట్టుకున్నాడు. పొలంలో అటుఇటు తిరుగుతూ అందర్నీ పరుగులు పెట్టించింది గిరినాగు. దాంతో, కింగ్‌ కోబ్రాను బంధించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది సహకారం తీసుకోవాల్సి వచ్చింది. అత్యంత చాకచక్యంగా నల్లత్రాచును పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్‌.. దాన్ని అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు.

అయితే, అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రా పొలంలో కనిపించడంతో హడలిపోయారు పాలగడ్డ గ్రామస్తులు. పది అడుగుల పొడవున్న ఆ గిరినాగును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. దట్టమైన అడవుల్లో మాత్రమే తిరిగే కింగ్‌ కోబ్రా జనావాసాల్లోకి రావడాన్ని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు స్థానికులు. ఇదొక్కటేనా? ఇంకా ఉన్నాయా? అంటూ భయాందోళనలకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి..