కర్నూలు, డిసెంబర్ 6: సహజంగా పందులకు, కుక్కలకు అస్సలు పడదు. పందులు కనిపిస్తే కుక్కలు వెంట పడతాయి. కుక్క పిల్లలు కనిపిస్తే పందులు కసితీరా గాయపరచి చంపేస్తాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి కుక్క పిల్లకు పాలు ఇచ్చింది ఓ పంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మునెప్ప నగర్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
జాతివైరాన్ని మరిచి రెండు జంతు జాతులు అన్యోన్నంగా కలిసి ఉన్నాయి. ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లకు ఓ పంది స్తన్యం అందించి పాలు ఇచ్చింది. తన స్వచ్చమైన తల్లి హృదయం చాటి చెప్పింది. దీనిని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఇప్పుడది వైరల్ గా మారింది. జాతి వైరాలను మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా ఉంటున్న జంతువులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.