Mobile Phone: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరై పోయింది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకం తెగ పెరిగిపోయింది. అయితే ఫోన్‌లను ఎంత జాగ్రత్తగా వాడినా ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు పోగోట్టుకుంటుంటాం. మనలో చాలా మందికి ఒక్కసారైనా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అయితే మొబైల్ పోగానే ముందుగా ఏం చేస్తాం.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అనంతరం పోలీసులు విచారణ ప్రారంభించి దొంగలను లేదా మీరు ఫోన్‌ను జాడవిడిచిన చోటు ఎక్కడుందో కనుక్కొటారు. అయితే ఇదంతా సమయంతో కూడుకున్న విషయం.
అలా కాకుండా ఫోన్‌ను పొగొట్టుకున్న వెంటనే ఆన్‌లైన్‌లోనే పోలీసులుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! తాజాగా విజయనగరం జిల్లా పోలీసులు రాష్ట్రంలో తొలిసారి ఇలాంటి ఓ కొత్త ప్రయోగాన్ని చేసి విజయవంతమయ్యారు. ఫోన్‌లు కోల్పోయిన వారు ఫిర్యాదు చేసేందుకు ఎస్పి దీపికా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఫోన్‌ను పొగొట్టుకున్న వారు వెంటనే పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. దీంతో పోలీసులు నిమిసాల్లో స్పందించి. చర్యలు తీసుకుంటారు.
#DGP Shri K.V Rajendranath Reddy IPS,appreciates @PoliceVzm for their Professional alacrity,use of technology with demonstration of dedication & commitment in recovering 103 lost/stolen mobile phones. https://t.co/nCeBoxbuTq
— Andhra Pradesh Police (@APPOLICE100) August 18, 2022
మొబైల్‌ను ట్రాక్ చేసి గుర్తించేందుకు నలుగురు కానిస్టేబుల్స్‌తో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. గడిచిన పది రోజుల్లో ఏకంగా వందకుపైగా మొబైల్ ఫోన్స్‌ను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇక నుంచి మొబైల్స్ పొగొట్టున్న, గొంగతనానికి గురైనా బాధితులు పోలీస్ స్టేషన్‌కి రావొద్దని ఎస్పీ దీపికా ప్రజలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..