కేంద్ర ఉక్కు మంత్రికి విశాఖ స్టీల్స్ అధికారుల సంఘం లేఖ రాసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన ఈఓవై – ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రకారం సెయిల్ పాల్గొనేందుకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విశాఖ ఉక్కు అధికారుల సంఘం సోమవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఒక లేఖ రాసింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి 25 కిలోమీటర్ల పరిధిలో రెండు మేజర్ పోర్టులు ఉన్న నేపథ్యంలో ఉక్కుని ప్రభుత్వం రంగంలో కొనసాగిస్తూ ప్రగతికి బాటలు వేయాలని లేఖలో కోరారు సంఘం ప్రతినిధులు.
ప్రభుత్వం తెచ్చిన జాతీయ ఉక్కు విధానం ప్రకారం విశాఖ ఉక్కు కర్మాగారం 7.3 మిలియన్ టన్నులకు విస్తరించిన నేపథ్యంలో… ఇటీవల ఎదురైన కొన్ని ఆర్థిక ఇబ్బందుల్ని పరిష్కరించేలా చేయూతనివ్వాలని లేఖలో కోరారు. సెయిల్ అత్యధిక గనులు కలిగి ఉన్న నేపథ్యంలో.. విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని లేఖలో వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..