Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే

పోక్సో కేసులో నిందితుడిగా ఉండి.. 12 ఏళ్లుగా పరారీలో ఉన్న సల్మాన్ అనే యువకుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. కేసులో కండీనల్ బెయిల్‌పై బయటకొచ్చి.. కోర్టు తీర్పును దిక్కరించడంతో కోర్టు అతడిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు యూపీలోని బలరాంపూర్ ఉన్న నిందితుడి సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

Andhra News: 12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే
Andhra Crime

Edited By:

Updated on: Jan 27, 2026 | 11:55 PM

ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి 12 ఏళ్లు చిక్కకుండా తిరుగున్న ఓ కేటుగాన్ని ఎక్కకేలకు పట్టుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెల్తే.. యూపీకి చెందిన సల్మాన్ అనే యువకుడు కొన్నాళ్ల క్రితం విశాఖకు వలస వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని అల్లిపురం ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఓ బాలికతో పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి రిమాండ్ కూడా విధించింది. ఇది జరిగి దాదాపుగా 12 ఏళ్లు కావస్తోంది.

జ్యూడిషల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు సల్మాన్.. కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటినుంచి ఎస్కేప్ అయ్యాడు. పోలీసుల వెతుకుతున్న కనిపించలేదు. కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో కోర్టు నానుబైలబుల్ వారంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయినప్పటికీ సల్మాన్ ఆచూకీ లభించలేదు. దీంతో చివరికి న్యాయస్థానం సల్మాన్ పై.. ప్రోక్లైమ్డ్ అఫెండర్ గా కోర్టు పట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో నిందితుడిని పట్టుకోవాలని సీపీ బాగ్చి ప్రత్యేకంగా దృష్టి సారించి.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న విశాఖ పోలీసులు.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేశారు. యూపీలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. బలరాంపూర్ లో ఉన్న సల్మాన్ ను అక్కడి పోలీసుల సహకారంతో పట్టుకొని విశాఖకు తీసుకువచ్చారు. కోర్టులో హాజరు పరిచామని అన్నారు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి.

ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. ఒక నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా ఉంటే నాన్ బెయిలబుల్ వారంటిల్లో జారీ చేస్తారు. అయితే సల్మాన్ విషయంలో ప్రోక్లైమ్డ్ అఫెండర్ గా అర్దర్స్ జారీ చేసింది కోర్ట్. 12 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు నిందితుడు చిక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతటి నేరగడైనా ఖాకీల కళ్ళ నుంచి తప్పించుకోలేడని మరోసారి సల్మాన్ అరెస్టుతో తెలింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.