Vizag: ఎమ్మెల్సీ ఎన్నిక.. వేడెక్కిన సాగరతీరం.. జగన్ రిక్వెస్ట్ ఇదే…

|

Aug 07, 2024 | 5:45 PM

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కూటమి, వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్‌.. టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు. బొత్సను గెలిపించాలని కోరారు.

Vizag: ఎమ్మెల్సీ ఎన్నిక.. వేడెక్కిన సాగరతీరం.. జగన్ రిక్వెస్ట్ ఇదే...
YS Jagan
Follow us on

విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, ప్రతిపక్ష వైసీపీ స్పెషల్‌ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా గెలిచి తీరాలని… వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు వైసీపీ అధినేత జగన్‌. ఎమ్మెల్సీ స్థానం గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత.. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లి పార్టీ కార్యాయలంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులకు జగన్ సూచించారు. టీడీపీకి తగిన సంఖ్యా బలం లేకపోయినా పోటీ చేస్తోందని.. నైతిక విలువలు ఉన్న రాజకీయ పార్టీ అయితే అసలు పోటీ పెట్టకూడదన్నారు. వైసీపీ ప్రతినిధులను చంద్రబాబు డబ్బుతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. YCPకి 380పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందన్నారు. విలువులు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయని.. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు, మన ఇంట్లో కూడా మనకు విలువ తగ్గుతుందన్నారు. ఈ ఐదేళ్ల పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉండాలని.. బొత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు జగన్.

మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. వైసీపీకి సంఖ్య పరంగా బలం ఉన్నా.. కూటమి నేతలు గెలుపు కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ నివాసంలో జరిగిన భేటీకి అరకు, పాడేరు నుంచి 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. మరికొంతమందిని టచ్‌లోకి తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు. పోటాపోటీ సమావేశాలతో సాగర తీరం కేంద్రంగా రాజకీయం వేడెక్కింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..