బర్త్ డే అంటే ఎవరికైనా వెరీ వెరీ స్పెషల్… అందులోనూ కాస్త డిఫరెంట్ గా జరుపుకుంటే దానికదే వేరు.. తమకు తాము పుట్టినరోజు జరుపుకోవడం కామన్.. కానీ నీటిలో ఉన్న తమ స్నేహితుడికి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా.. అదే జరిగింది విశాఖలో. హ్యాపీగా కేక్ కట్ చేయడమే కాదు… కూరగాయలు పండ్లు తినిపించి విషెస్ కూడా చెప్పారు.
ఇలాంటి అరుదైన ఘటన ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ నీటిఏనుగు పేరు జూనియర్ దళపతి.. తనకు ఏడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా కేక్ కటింగ్ వేడుకంగా జరిగింది. హిప్పో కోసం కూరగాయలు, పండ్లుతో తయారుచేసిన ఫీడ్ ను అందచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..