వావ్.. కాశ్మీర్‌ కాదు మన అరకు.. పర్యాటకుల సందడే సందడి.. ఇదిగో వీడియో

ప్రకృతి ఒడిలో పరవశించే అరకు లోయ.. ఒక్కసారిగా కాశ్మీర్‌ను తలపించింది! అరకు ఏజెన్సీలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై.. చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన విరుచుకుపడింది. ఆకాశం నుంచి రాలుతున్న మంచు ముక్కలు చూసి పర్యాటకులు పరవశించిపోయారు.

వావ్.. కాశ్మీర్‌ కాదు మన అరకు.. పర్యాటకుల సందడే సందడి.. ఇదిగో వీడియో
Araku

Edited By:

Updated on: Mar 27, 2026 | 6:03 PM

ప్రకృతి ఒడిలో పరవశించే అరకు లోయ.. ఒక్కసారిగా కాశ్మీర్‌ను తలపించింది! అరకు ఏజెన్సీలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై.. చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన విరుచుకుపడింది. ఆకాశం నుంచి రాలుతున్న మంచు ముక్కలు చూసి పర్యాటకులు పరవశించిపోయారు. అరకులోని పలు రిసార్టుల దగ్గర మంచు కుప్పలు పేరుకుపోవడంతో.. పర్యాటకులు వర్షంలో తడుస్తూ, వడగళ్లతో ఆడుకుంటూ సందడి చేశారు.

విశాఖలోని ఏజెన్సీ ఏరియాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకే రోజు మూడు రకాల వాతావరణం దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శీతాకాలం ముగిసి నెల రోజులుగా ఎండలు మండుతున్న వేళ.. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వెదర్‌ ఆహ్లాదకరంగా మారుతోంది. ఒకే రోజులో ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన పడుతుండడంతో స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

వీడియో చూడండి..

విశాఖ ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో ఇవే వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. వేసవికాలంలో ఉదయం అక్కడక్కడ పొగ మంచు.. ఆ తర్వాత.. కొన్ని చోట్ల ఎండ.. సాయంత్రానికి ఆకాశం మేఘామృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మండు వేసవిలో కూల్‌ వెదర్‌ను విశాఖ ఏజెన్సీ ప్రజలు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us