నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు దుండగులు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథాన్ని నిప్పుపెట్టిన వారు ఆ తరువాత అక్కడి నుంచి పరారీ అయ్యారు. రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పకీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కొండబిట్రగుంటలో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. దీనిపై ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకతాయిల చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆయన అన్నారు.