National Museum: రాజ్యాంగం అసలు ప్రతి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోనే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఉదయం మ్యూజియంను సందర్శించిన కిషన్ రెడ్డి.. జనవరి నుంచి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. మ్యూజియంలో 57 లక్షల ఫైల్స్, 18 కోట్ల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని వెల్లడించారు.
మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని స్వాత్మానందేంద్ర స్వామి ఇవాళ ఢిల్లీలో కలిశారు. ప్రాచీన ఆలయాల్లో పురావస్తు శాఖ నిబంధనలపై చర్చించారు. ఆర్కియాలజీ శాఖ అడ్డంకులు తొలగించాలని కిషన్ రెడ్డిని కోరారు స్వాత్మానందేంద్ర.
విశాఖ శారదాపీఠం ఈనెల 24 నుంచి చేపట్టే చాతుర్మాస్య దీక్ష గురించి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని ఆశీర్వదించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి పీఠం దుశ్శాలువతో కిషన్ రెడ్డి దంపతులు సత్కరించారు.
Read also: Telangana Rains: అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ