Visakha RK Beach: ముంచేస్తున్న అలలను తట్టుకోలేక.. ఒడ్డుకు కూతవేటు దూరంలో కళ్లముందే ఓ యువకుడు మునిగిపోయాడు. లైఫ్ గార్డ్స్‌తో కష్టపడి పైకి తీసుకొచ్చినవారిలోనూ కొందరు బ్రతికి లేరు. అప్పటికే పొట్టలోకి నీరు చేరడంతో.. ప్రాణాలు కోల్పోయారు. ఇవీ.. విశాఖ బీచ్‌లో జరిగిన విషాద గల్లంతు ఘటనలో కనిపించిన బాధాకర దృశ్యాలు. అమాంతం పైకొస్తున్న అలల్ని చూస్తే.. పై ప్రాణం పైనే వెళ్లిపోతుంది. అలాంటి అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న మనిషిని లైవ్‌లో చూస్తే.. ఎలా ఉంటుంది? అక్కడున్న వారికి అలాంటి భయానక అనుభూతే కలిగింది.
ఆనందంగా గడిపేందుకు వచ్చివారికి.. ఆయుర్దాయం తీరిపోయింది. సికిందరాబాద్‌కు చెందిన 8మంది యువకులు.. మధ్యాహ్నం ఆర్కే బీచ్‌కు చేరుకుని స్నానం కోసం సముద్రంలోకి వెళ్లారు. పెద్ద కెరటం దూసుకురావడంతో.. అందులో ముగ్గురు నీట మునిగారు. కొన ఊపిరితో ఉన్న శివ అనే యువకుణ్ని లైఫ్ గార్డ్స్‌తో పైకి తీసుకొచ్చినా.. ఫలితం లేకపోయింది. చివరకు ప్రాణాలు విడిచాడు. ఇక పొట్టలో నీరు చేరడంతో మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే విహారం కోసం వచ్చిన ఒడిశా విద్యార్థులూ.. ఈ అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. భద్రక్ జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు.. పిక్నిక్ కోసం ఆర్కే బీచ్‌కు వచ్చారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. పెద్ద కెరటం ఎగిసిపడింది. దీంతో, ఓ విద్యార్థి గల్లంతై.. కొద్ది సేపటికే శవమై ఒడ్డుకు చేరింది. మిగిలిన నలుగురూ క్షేమంగా ఒడ్డుకు చేరారు.
ఇవి కూడా చదవండి: