వెంకన్న భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడీ

| Edited By: Srinu

Nov 07, 2019 | 3:21 PM

తిరుమలకు వచ్చే వెంకన్న భక్తులకు టీటీడీ షాక్‌ని ఇచ్చింది. తాజాగా.. ఈమధ్య టీటీడీ పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో ఇదొకటిగా చెప్పవచ్చు. దీంతో.. భక్తులకు ఈ న్యూస్ ఒకింత నిరాశకు గురి చేసింది. తిరుమల శ్రీనివాసుని దర్శనం సకల పాపహరణం అని భావిస్తూంటారు భక్తులు. ఆయన దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసినా.. ఆనందపరవశం కలకాలం గుర్తిండిపోతుందంటారు.. శ్రీ తిరుమలేశుని భక్తులు. నిత్యం వేలాది మంది.. స్వామివారిని దర్శించుకుంటూంటారు. తాజాగా.. తిరుమలలో గదుల అద్దె పెంచుతూ టీటీడీ […]

వెంకన్న భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడీ
Follow us on

తిరుమలకు వచ్చే వెంకన్న భక్తులకు టీటీడీ షాక్‌ని ఇచ్చింది. తాజాగా.. ఈమధ్య టీటీడీ పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో ఇదొకటిగా చెప్పవచ్చు. దీంతో.. భక్తులకు ఈ న్యూస్ ఒకింత నిరాశకు గురి చేసింది. తిరుమల శ్రీనివాసుని దర్శనం సకల పాపహరణం అని భావిస్తూంటారు భక్తులు. ఆయన దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసినా.. ఆనందపరవశం కలకాలం గుర్తిండిపోతుందంటారు.. శ్రీ తిరుమలేశుని భక్తులు. నిత్యం వేలాది మంది.. స్వామివారిని దర్శించుకుంటూంటారు.

తాజాగా.. తిరుమలలో గదుల అద్దె పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. నందకం విశ్రాంతిగృహంలో గది అద్దెను రూ.600 నుండి వెయ్యి రూపాయలకు పెంచారు. కౌస్తుభం, పాంచజన్యం విశ్రాంతిగృహాల్లో గది అద్దె రూ.500 నుంచి వెయ్యికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి తెచ్చిన టీటీడీ. ఇది తెలియని.. తిరుమలకు వచ్చిన భక్తులు షాక్ అవుతున్నారు.