యాక్సిడెంట్ చేసి పరారైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

| Edited By: Anil kumar poka

Sep 16, 2019 | 9:43 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్‌కు గురి అయింది. ఆయన కారు ఢీకొని శ్రీకాకుళానికి చెందిన జగన్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు స్థానిక భాష్యం స్కూల్‌లో ఓ మేస్త్రీగా పనిచేస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో కారు వదిలి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అక్కడి నుంచి పరారీ అయినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడి బంధువులు శ్రీశైలం జాతీయ రహదారిపై […]

యాక్సిడెంట్ చేసి పరారైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
Follow us on

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్‌కు గురి అయింది. ఆయన కారు ఢీకొని శ్రీకాకుళానికి చెందిన జగన్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు స్థానిక భాష్యం స్కూల్‌లో ఓ మేస్త్రీగా పనిచేస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో కారు వదిలి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అక్కడి నుంచి పరారీ అయినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడి బంధువులు శ్రీశైలం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. జగన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. కాగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇదిలా ఉంటే కారు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ సీటులో ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆ సమయంలో డ్రైవర్ ఉన్నాడా? లేకపోతే ఎమ్మెల్యే సొంతంగా డ్రైవ్ చేశారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన తర్వాత అటుగా వెళ్లిన ఓ ఎమ్మెల్యే తనకేమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జైపాల్ యాదవ్ కారు ఇదివరకు కూడా ఒకసారి ప్రమాదానికి గురైంది. 2018 అక్టోబర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా కర్కల్ పహాడ్ వద్ద హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి జైపాల్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డారు.