శ్రీనివాసుని ఖజానాలో ఆభరణాల లెక్కేంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ..!!

| Edited By:

Sep 27, 2019 | 10:59 PM

తిరుమల చరిత్రకు పురాతన నాణేల సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో మొట్టమొదటి సారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చిన పంచ్ మార్డ్క్(విద్ధాంత నాణేలు) మొదలుకొని ఎందరో చక్రవర్తులు, రారాజులు తిరుమల శ్రీనివాసునికి కానుకల రూపంలో సమర్పించిన నాణేలలో ఆనాటి బారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను కంటికి కట్టినట్లు భావితరాలకు తెలియచేస్త్తున్నట్లుగా టి‌టి‌డి మ్యూజియంలో భక్తుల సందర్శనార్ధం ఉంచిన పురాతన వస్తువులే “తిరుమలచరిత్ర” కు ఆధారంగా నిలుస్తున్నాయి.. కోరిన […]

శ్రీనివాసుని ఖజానాలో ఆభరణాల లెక్కేంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ..!!
Follow us on

తిరుమల చరిత్రకు పురాతన నాణేల సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో మొట్టమొదటి సారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చిన పంచ్ మార్డ్క్(విద్ధాంత నాణేలు) మొదలుకొని ఎందరో చక్రవర్తులు, రారాజులు తిరుమల శ్రీనివాసునికి కానుకల రూపంలో సమర్పించిన నాణేలలో ఆనాటి బారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను కంటికి కట్టినట్లు భావితరాలకు తెలియచేస్త్తున్నట్లుగా టి‌టి‌డి మ్యూజియంలో భక్తుల సందర్శనార్ధం ఉంచిన పురాతన వస్తువులే “తిరుమలచరిత్ర” కు ఆధారంగా నిలుస్తున్నాయి..

కోరిన కోరికలు తీర్చే కోనేటిరాయునికి భక్తులు హుండిలో ముడుపులు చెల్లించడం ఆనవాయితీ. ప్రస్తుత హుండిని బ్రిటిష్ వారి హయాంలో శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేశారు. అప్పటి నుండి భక్తులు ఆకాలంలో ఆయా కాలం నాటి నాణేలను విరివిగా హుండిలో కానుకలుగా సమర్పించేవారు. అంతకముందు కాలంలో పల్లవులు, చోళులు, విజయనగర రాజులు సమర్పించిన కానుకలను అప్పట్లో ఆలయ కోశాధికారి స్వాధీన పరచుకుని రికార్డు చేసేవారు. అలా స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన వాటిని కొన్నింటిని ఇప్పటికీ శ్రీవారి ఖజానాలో నుండి సేకరించిన నాణ్యాలతో టి‌టి‌డి భక్తుల సందర్శనార్ధం తిరుమలలోని శ్రీవేంకటేశ్వరా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచింది. అందులో క్రీ.శ 1 వ శతాబ్దం కాలం నాటి రోమన్ నాణెం ప్రస్తుతం ఉన్న వాటిలో అతి పురాతన మైనది. అందులో నీరో చక్రవర్తి విడుదల చేసిన ఈ నాణెంలో ఒకవైపు రాజు – రాణి ల చిత్రం, మరో వైపు రాజు పేరు ఉన్నాయి.

ఆ తరువాత క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో మొట్టమొదటి సారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చిన పంచ్ మార్డ్క్(విద్ధాంత నాణేలు) క్రీ.శ. 7 వ శతాబ్దం నుండి 10 వ శతాబ్దం మద్య కాలం నాటి నాణేన్ని కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన పశ్చిమ గంగరాజులు విడుదల చేసిన నాణేలలో ఒక వైపు పట్టపుటేనుగు, మరో వైపు పూలతీగలు ఉన్నాయి. ఇక క్రీ.పూ 11 – 12 శతాబ్దాల మద్య కాలం నాటి హోయసాల నాణేన్ని విష్ణువర్దన మహారాజులు విడుదల చేసిన నాణెంలో ఒక వైపు సింహం బొమ్మ, మరో వైపు “శ్రీ నోలంబ వాడి గొండ” అని కన్నడ లిపిలో ఉంది. ఈ నాణేన్ని విష్ణువర్దన మహారాజు నోలంబను జయించిందుకు గుర్తుగా విడుదల చేసినట్లుగా తెలుస్తోంధి.

ఇవే కాకుండా ఇక్కడ ఉన్న నాణేలలో విజయనగరరాజుల కాలం నాటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో హరిహర రాయుల కాలం మొదలుకొని వేంకటపతి రాయుల కాలం వరకు విడుదల చేసిన నాణేలు ఎక్కువగా ఉన్నాయి. హరిహర రాయుల కాలంలో ముద్రించిన నాణేలకు ఒకవైపు వీరుడి బొమ్మ,మరోవైపు ” శ్రీ హరిహర” అని, ఇక రెండవ హరిహర రాయులు, దేవరాయులు, శ్రీకృష్ణ దేవరాయులు విడుదల చేసిన పలు నాణేలలో శివపార్వతులు ఒకవైపు, నాగరి లిపిలో రాజులపేర్లను మరోవపు లిఖించబడి ఉన్నాయి. వీరిహయాంలోనే మరికొన్ని నాణేలు ఒకవైపు వెన్నముద్ధ పట్టుకున్న కృష్ణుడు, మరో వైపు నాగరి లిపిలో ” శ్రీప్రతాప కృష్ణరాయ” రాయబడి ఉంది.ఇక అచ్యుత రాయుల నాణెంలో ఒకపక్క రాజు పేరు, మరో పక్క ” ఏనుగును నోట కరుచుకున్న రెండు తలల గండబేరుండ పక్షి” చిత్రించి ఉన్నాయి. ఇక వేంకటపతి రాయుల నాణెంలో ఓ పక్క శ్రీవేంకటేశ్వర స్వామి రూపాన్ని మరోపక్క స్వామి వారి నామాన్ని నగరి లిపిలో లిఖించారు. అంటే కాకుండా ఈ కాలంలో “వరహాలు ” అని చిన్నపాటి నాణేలను కూడా విడుధల చేశారు.

అనంతరం ముస్లిం రాజులు విడుదల చేసిన మొఘల్ నాణెం,అక్భర్, ఔరంగజేబు, షా ఆలం రాజుల నాణేలు అనేకం ఉన్నాయి.ఇంధులో ఒక వైపు ‘ఖురాన్ కలిమ’ మరో వైపు రాజు పేర్లు ఉన్నాయి. ఇక మైసూరు రాజ్యాన్ని పాలించిన ఆనాటి వడయార్ రాజులకాలం నాటి బంగారు నాణేలు,శ్రీరంగ పట్నంను పాలించిన హైదరాలీ, టిప్పుసుల్తాన్ నాణేలు, బ్రిటిష్ ఇండియా ,ఈస్ట్ ఇండియా కంపెనీలు విడుదల చేసిన నాణేలైన స్టార్ పగోడాలు, పగోడాలు, మోహార్ లాంటి నాణేలు,త్రిస్వామి నాణెంలో శ్రీదేవి, భూదేవి, సమేతంగా శ్రీ మహావిష్ణువు బొమ్మలు, పాగోడా నాణెంలో ఒక వైపు వేంకటేశ్వర స్వామి బొమ్మ,మరోవైపు శ్రీవారి ఆలయ గోపురం బొమ్మలున్నాయి. ఇక బ్రిటిష్ హయాంలో అప్పటి హిందువులను మెప్పించేందుకు గాను మన సంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు నమ్మించేందుకు కొన్ని నాణేలను హిందూ సంప్రదాయ బొమ్మలు ముద్రించారు.

ఇక విక్టోరియా మహారాణి, కింగ్ జార్జి నాణేలతో పాటు అప్పట్లో చలమణిలో రాని రామ టంకా, పద్మ టంకా నాణేలు కూడా ఈ మ్యూజియంలో కొలువుతీరాయి. ఈ రామటంకా,పద్మటంకా నాణేలను అప్పట్లో పూజలకు వినియోగించేవారట. ఈ నాణేలను చూస్తే అప్పటి ముద్రణా కేంద్రాలను కూడా తెలుసుకోవచ్చు, విజయనగర రాజుల కాలంలో తిరుపతి, గుత్తి ,గండికోట, గుర్రంకొండ, కోలారులో ముద్రణా కేంద్రాలు ఉన్నట్లుగా ,బ్రిటిషు వారి కాలంలో హైదరాబాద్, మచిలీపట్నం, చెన్నైలో ముద్రణ కేంద్రాలు ఉన్నట్లు గా తెలుస్తోంధి. ఇవే కాకుండా బంగారు నాణేలతో పాటు బహమనీ సుల్తానుల కాలం నాటి వెండి నాణేలు, చోళులు, పలు సంస్థానాధీశులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, నిజాం రాజులు విడుధల చేసిన అనేక రాగి నాణేలు ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇలా పురాతన కాలంనాటి నుండి ఎంతో మంధి రాజులు స్వామి వారికి ధూపదీప నైవేద్యాల కోసం, కైంకర్యాల కోసం స్వామి వారికి నాణేలను కానుకగా సమర్పించారు. బంగారు నాణేలను అప్పట్లో కరిగించి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించినట్లు శ్రీకృష్ణ దేవరాయులు 1518 సం..కాలం నాటి శాసనం ద్వారా తెలుస్తోంది.

ఇలా ఆకాలంలో శ్రీవారి కోశాగారంలో ఉన్న ఎన్నో బంగారు నాణేలను వ్యవసాయం కోసం చెరువులు,కాలువలు తవ్వించడానికి,రోడ్ల నిర్మాణాలకోసం ఖర్చు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంధి. ఇలా నాటి నుండి నేటి వరకు శ్రీవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన నాణ్యాలే కాధు, గతంలో శ్రీవారికి వినియోగించిన పూజా సామగ్రి, రాజులు విన్యోగించిన ఎన్నో యుద్ధ సమగ్రీలు, వాయిధ్యాలు ,పురాతన విగ్రహాలు, పలు ఛాయాచిత్రాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకోవదేమే కాకుండా తిరుమలలో టి‌టి‌డి ఏర్పాటు చేసిన వేంకటేశ్వర మ్యూజియం చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయని భక్త కోటి ఆనందం చెందుతోంది.