రికార్డు స్థాయిలో తిరుమలేశుడి హుండీ ఆదాయం

| Edited By:

Oct 05, 2020 | 7:19 AM

కరోనా ఎఫెక్ట్‌ కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంపై భారీగా పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని

రికార్డు స్థాయిలో తిరుమలేశుడి హుండీ ఆదాయం
Follow us on

Tirumala Tirupati News: కరోనా ఎఫెక్ట్‌ కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంపై భారీగా పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని నెలల పాటు తిరుమలలో భక్తులకు దర్శనం ఆపేయడం, తిరిగి తెరుచుకున్న తరువాత పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిని ఇస్తుండటంతో హుండీ ఆదాయం కూడా బాగా తగ్గింది. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుటపడటంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. ఆదివారం రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చింది.

ఆదివారం శ్రీవారిని 20,228 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీలో రూ.2.14కోట్లు సమర్పించుకున్నారు. అలాగే 6,556 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ నెల 16 నుంచి 24వ తేది వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఈ సారి మాడవీధుల్లో వాహన సేవల ఊరేగింపు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ప్రారంభించింది.

Read More:

Bigg Boss 4: అతడిపై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి

IPL 2020: CSK vs KXIP : గర్జించిన చెన్నై, పంజాబ్‌పై ఏకపక్ష విజయం