ఖాకీ పహారాలో భైంసా.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి కర్ఫ్యూ..!

| Edited By:

Jan 14, 2020 | 1:31 PM

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం.. ఇప్పుడు ఖాకీల కవాతుతో నిశ్శబ్ధంగా మారిపోయింది. కేవలం ర్యాపిడ్ యాక్షణ్ ఫోర్స్ చేస్తున్న కవాతు చప్పులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం కొర్వగల్లిలో చోటుచేసుకున్న ఓ చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఓ వర్గం వారికి చెందిన ఇళ్లపై ఒకేసారి పెద్ద ఎత్తున దాడి చేయడంతో పాటు.. పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో 18 ఇళ్లు, పదుల సంఖ్యలో వాహనాలు […]

ఖాకీ పహారాలో భైంసా.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి కర్ఫ్యూ..!
Follow us on

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం.. ఇప్పుడు ఖాకీల కవాతుతో నిశ్శబ్ధంగా మారిపోయింది. కేవలం ర్యాపిడ్ యాక్షణ్ ఫోర్స్ చేస్తున్న కవాతు చప్పులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం కొర్వగల్లిలో చోటుచేసుకున్న ఓ చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఓ వర్గం వారికి చెందిన ఇళ్లపై ఒకేసారి పెద్ద ఎత్తున దాడి చేయడంతో పాటు.. పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో 18 ఇళ్లు, పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నా.. మంటలను ఆర్పుతున్న ఫైర్ ఇంజన్ల పైపులను కట్ చేయడంతో.. వాహనాలు, ఇళ్లు దాదాపు పూర్తిగా కాలిపోయాయి. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకోవడంతో.. 30 మందికి పైగా గాయపడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారులు కూడా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటన జరిగిన ప్రాంతంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ, పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు. బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అంతా సంయమనం పాటించాలని అధికారులు సూచించారు. ఈ ఘాతుకానికి కారణమైన వారిని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, సోమవారం వదంతులు వ్యాపించడంతో.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించడమే కాకుండా.. మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. మంగళవారం కూడా పట్టణంమొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. స్థానికుల్లో ధైర్యం నింపేందుకు పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది.