మీరే జోక్యం చేసుకోండి.. గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ

| Edited By:

Oct 22, 2019 | 10:30 AM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్‌‌ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమ్మె జరుగుతున్న తీరును వివరించారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు స్పష్టంచేసినా.. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం.. డిపో మేనేజర్లను, కార్మికులను ప్రలోభపెడుతోందంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు […]

మీరే జోక్యం చేసుకోండి.. గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ
Follow us on

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్‌‌ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమ్మె జరుగుతున్న తీరును వివరించారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు స్పష్టంచేసినా.. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం.. డిపో మేనేజర్లను, కార్మికులను ప్రలోభపెడుతోందంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ యధావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్‌, సింగరేణి కార్మికుల మద్దతు కూడా కోరతామన్నారు. ఆర్టీసీ కార్మికుల జీతాల విషయంలో ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిందని.. రాష్ట్రంలో 90శాతం బస్సులు తిరిగితే ఆర్టీసీ దగ్గర డబ్బులు ఎందుకు ఉండవంటూ ప్రశ్నించారు.