జషిత్ సమాచారంతో కిడ్నాపర్లను పట్టుకుంటాం: ఎస్పీ నయీం

| Edited By:

Jul 25, 2019 | 9:02 AM

జషిత్ క్షేమంగా ఇంటికి రావడంలో మీడియా పాత్ర చాలా ఉందని తూర్పు గోదావరి ఎస్పీ నయీం అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. జషిత్‌ను సురక్షితంగా అతడి తల్లిదండ్రులకు అప్పగించిన నయీం అనంతరం మాట్లాడుతూ.. కుతుకులూరు దగ్గర బాలుడిని కిడ్నాపర్లు వదిలివెళ్లారని.. కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు బాలుడిని తమ బృందం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక జషిత్ ఆరోగ్యంగానే ఉన్నాడని వెల్లడించారు. కిడ్నాప్‌పై అతడు కొంత సమాచారం ఇచ్చాడని.. జషిత్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును […]

జషిత్ సమాచారంతో కిడ్నాపర్లను పట్టుకుంటాం: ఎస్పీ నయీం
Follow us on

జషిత్ క్షేమంగా ఇంటికి రావడంలో మీడియా పాత్ర చాలా ఉందని తూర్పు గోదావరి ఎస్పీ నయీం అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. జషిత్‌ను సురక్షితంగా అతడి తల్లిదండ్రులకు అప్పగించిన నయీం అనంతరం మాట్లాడుతూ.. కుతుకులూరు దగ్గర బాలుడిని కిడ్నాపర్లు వదిలివెళ్లారని.. కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు బాలుడిని తమ బృందం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక జషిత్ ఆరోగ్యంగానే ఉన్నాడని వెల్లడించారు. కిడ్నాప్‌పై అతడు కొంత సమాచారం ఇచ్చాడని.. జషిత్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేస్తామని అన్నారు. త్వరలో కిడ్నాపర్లను పట్టుకుంటామని నయీం స్పష్టం చేశారు.

అయితే కిడ్నాప్ చేసిన వారిలో తనకు ఒకరు తెలుసని  జషిత్ తెలిపాడు. రాజు అనే వ్యక్తి తనను కారులో వదిలేశాడని జషిత్ పేర్కొన్నాడు. మరి రాజు ఎవరు..? జషిత్‌ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడు..? జషిత్ కుటుంబానికి, రాజుకు మధ్య సంబంధమేంటి..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.