Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..

| Edited By: Ravi Kiran

Oct 18, 2024 | 11:19 AM

చూడటానికి అందంగా ఉంటుంది.. ముందు పరిచయం చేసుకొని.. ఆ తర్వాత అసలు సీన్ మొదలుపెడుతుంది.. ఇలా క్లోజ్ మూవ్ అయి.. ట్రాప్ లో పడేస్తుంది. చివరకు మత్తు మందు కలిపి ప్రైవేట్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకుని బెదిరిస్తుంది ఈ జాయ్ జమీమా.. ఈమె ఉచ్చులో పడిన పెళ్లైన మగాళ్లు.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..
Vizag Honey Trap Case
Follow us on

హనీ ట్రాప్ లేడీ జాయ్ జెమిమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీయటి మాటలు, తన అంద చందాలతో మగవాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది.. సమాజంలో పలుకుబడి డబ్బున్న వాళ్లు వ్యక్తులే టార్గెట్ గా చేసుకొని.. ట్రాప్ చేసి.. మత్తుమందు ప్రయోగించి.. చనువుగా ఉన్న ఫోటోలో వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ జాయ్ జమీమా.. ఆమె ట్రాప్ లో పడిన మరో బాధితుడు ఆమె బెదిరింపులకు విలవిలలాడిపోయాడు. ఇప్పటికే ఎన్నారై యువకుడు సహా ఇద్దరు పోలీసులను ఆశ్రయించగా.. తాజాగా పోలీసుల ముందుకు హైదరాబాద్ కు చెందిన మరొకడు తన గోడును వినిపించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.. దీంతో విశాఖ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇలా జాయ్ జమీమా మోసాలపై కేసు నమోదు కావడం.. ఇది మూడోది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి విశాఖలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో కంపెనీలో యజమాని బంధువుగా వచ్చి పరిచయం చేసుకున్న జాయ్ జెమిమా.. తాను కూడా కంపెనీలో వర్క్స్ హెడ్ గా పని చేస్తున్నానని.. ప్రతిరోజు అతని దగ్గరకు వచ్చి చనువుగా ఉండేది. ఆ తర్వాత అతనిపై మత్తు మందు ప్రయోగించింది. మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చింది.. ఆ తర్వాత అతను మత్తులోకి జారుకున్నాక.. చనువుగా ఉన్న ఫోటోలు తీయడంతోపాటు వీడియోలు రికార్డు చేసింది. వాటిని అతనికి చూపించి బ్లాక్‌మెయిల్ చేసింది.. ఇలా పలు దఫదఫాలుగా కోటి వరకు లాగేసింది నిందితురాలు. అడిగినంత ఇవ్వకపోతే ఈ ఫోటోలను భార్యా బంధువులకు పంపిస్తామని బాధితుడిని బెదిరించింది.

గర్భవతి అయ్యానని అయిదు లక్షలు..

బాధితుడు మే 2022 లో హైదరాబాద్ వెళదామని అనుకున్నప్పుడు.. నిందితురాలు, బాధితుడు క్లోజ్ గా కలిసి ఉన్న కొన్ని ఫోటోలను, వీడియోలను చూపిస్తూ వాటిని బాధితుడి కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. బాధితుడు వద్దని బ్రతిమాలగా తాను గర్భవతినని చెప్పింది. వారం రోజులు తరువాత తన మామకు ఈ విషయం తెలుసిందని.. అయిదు లక్షల రూపాయలను ఇస్తే సమస్య ఉండదని చెప్పింది. బాధితుడు తన ఫ్రెండ్ కి అడిగి అతని ఖాతా నుండి నిందితురాలు ఖాతాకు 5 లక్షలు జమ చేసాడు. అక్కడ నుంచి ప్రతీ నెలా బెదిరిస్తూ లక్ష రూపాయలు తీసుకొనేది. నగరంలో ఒక ప్రాంతంలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని అందులో 4 లక్షల విలువైన ఫర్నిచర్ కొనిపించి.. అపార్టుమెంటులో నిందితురాలు, బాధితుడు ఫోటోలతో భార్యాభర్తల మాదిరి అలంకరించింది. బాధితుడు హైదరాబాద్ వెళ్లిన ప్రతీ సారి వీడియో కాల్స్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ విశాఖలోనే ఉండేలా చేసింది.

కొన్నాళ్ళకు బాధితుడు తన ఆరోగ్య సమస్యల కారణముగా హైదరబాద్ లో ఉండేందుకు నిందితురాలిని ఒప్పించగా.. అందుకు హైదరబాద్ లో అద్దెకు మరో ఇల్లు తీసుకోమని, ఫర్నిచర్ తో పాటు టూ వీలర్ కొనమని బెదిరించి 10 లక్షలు ఖర్చు చేయించింది. అక్కడ నుండి తిరిగి విశాఖపట్నం వచ్చి మరో ఇళ్లు అద్దెకు తీసుకొమని బెదిరించి 6 లక్షలు విలువైన ఫర్నిచర్ కొనిపించింది.

మూడు కోట్లిస్తే…

తనను విడిచి పెట్టాలని ప్రాధేయపడితే మూడు కోట్లు ఇస్తే వదిలేస్తానని ఆఫర్ చేసింది. ఫోటోలు వీడియోలు డిలీట్ చేసి రిలేషన్ ముగిద్దాం.. అని చెప్పింది. బాధితుడు తనకు తెలిసిన స్నేహితుడు ద్వారా ఆ డబ్బు ఇప్పిస్తామని చెప్పాడు.

నిర్బంధించి.. హింసించి..

అయితే.. తనకు ఇవ్వాల్సిన మూడు కోట్లు ఇవ్వకుండా బాధితుడు పారిపోతాడని అనుమానించి ఒక గదిలో తాళం వేసి వారం రోజులు పాటు నిర్బంధించింది. కొడుతూ బెదరిస్తూ, ఆహరం లేకుండా కేవలం జూస్లు ఇస్తూ హింసించి, బాధితుడి స్నేహితులకు, భార్యాపిల్లలకు ఆ ఫోటోలు, వీడియోలు పంపింది జెమిమా. చివరగా బాధితుడు సదరు 3 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా నమ్మిస్తూ.. తన బంగారం, యాపిల్ ల్యాప్ ట్యాప్ లు, ఐ ఫోన్లు, 3 లక్షల నగదు తీసుకొని హైదరాబాదు బయలుదేరాడు. తెలుసుకున్న జమీమా… మార్గ మధ్యలో నిందితురాలి మామ కారు ఆపి.. లోపలకి బలవంతముగా వచ్చి కారుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళమని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం, విలువైన వస్తువులు, నగదు తీసుకోడానికి ప్రయత్నించారని బాధితుడు చెప్పాడు.. ఈ సమయంలో నిందితురాలు జాయ్ జమీమా తన హ్యాండ్ బ్యాగ్ లోని నుంచి కత్తిని తీసి పొడవడానికి ప్రయత్నించినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రాణభయంతో.. తప్పించుకొని హైదరాబాద్ వెళ్లి కుటుంబ గౌరవం కారణముగా ఫిర్యాదు చేయలేదని బాధితు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాధితులపై మిస్సింగ్ సెక్సువల్ హరాస్మెంట్ కేసు

అయితే.. హైదరాబాదుకు బాధితుడు వెళ్లిపోయిన తర్వాత తరువాత నిందితురాలు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్, సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు పెట్టింది. అది తెలిసి స్టేషన్ కు వెళ్లి బాదితుడు బెయిల్ తీసుకొని తిరిగి వెళ్లిపోయాడు. కానీ జెమీమ మోసాలపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయాడు. ఈ విషయాన్ని తాజాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు స్నేహితుడు..

బాధితుడు ఫిర్యాదు ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు..జాయ్ జమీమా, ఆమె సహచరులు కలిసి డబ్బు, ఆస్తులు సంపాదించేందుకు కుట్ర పన్నారని, ప్రాణభయంతో మోసం చేసి, బెదిరించి, ధనవంతులను ప్రేమ ముసుగులో మోసపూరితంగా ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేశారని, బాధితులకు మత్తు స్ప్రేలు, జ్యూస్‌లు అందించి, వారిని మగతలోకి నెట్టి , ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫోటోలు దిగి , తరువాత వాటితో బెదిరించడం, వారి కుటుంబం, స్నేహితులతో ఆ ఫోటోలు, వీడియోలను సర్క్యులేట్ చేస్తానని బెదిరించి వారి నుండి భారీగా డబ్బు వసూలు చేయడం గుర్తించారు. బాధితుడి 25 లక్షలు విలువైన వస్తువులను అంటే ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, నగలు, దాదాపు 75 లక్షల రూపాయల డబ్బును దోచుకుందనీ.. అంతా కలిపి బాధితుడి నుంచి కోటి రూపాయలు తీసుకుంది.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయ్ జమీమా, ఆమె సహచరులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

జాయ్ జమిమ ఇదివరకు కూడా కొంతమందితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వాళ్ళ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసారనే సమాచారం మేరకు భీమిలి పోలీసులు ఒక కేసు, కంచరపాలెం పోలీసులు ఒక నమోదు చేసి, నిందితురాలిని రిమాండుకు తరలించిన విషయం విధితమే. జాయ్ జమిమా తో చేతులు కలిపి వివిధ నేరాలలో ఆమెతో పాటు పాల్గొన్న ఆమె సహచరులు అందరి ఫైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సిపి శంకబ్రత బాగ్చి ఈ కేసు పై ప్రత్యేకంగా దృష్టి సారించి పర్యవేక్షిస్తున్నారు. బాధ్యతలు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..