
తెలుగు రాష్ట్రాల్లోని వందే భారత్ ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ స్లీపర్ రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ రూట్లల్లో వందే భారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పంది. ఈ రైల్లో ఆక్సుపెన్సీ పూర్తై రద్దీగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా సీట్లు దొరకడం లేదు. దీంతో రైల్వేశాఖ ఈ రైలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్‌కు కోచ్‌ల సంఖ్యను మరింతగా పెంచింది. ఇప్పటివరకు 16 కోచ్‌లు ఈ వంద భారత్ రైళ్లో ఉండగా.. ఇప్పుడు మరో 4 కోచ్‌ల సామర్థ్యం పెంచారు. దీంతో మొత్తం కోచ్‌ల సంఖ్య 20కి చేరుకుంది. దీంతో ఈ రూట్లో ప్రయాణించేవారికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో మరింత మందికి ప్రయోజనం జరగనుంది.
మొత్తం 20 కోచ్‌లలో 18 ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉండగా.. రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్‌లు ఉన్నాయి. దీంతో ఈ రైల్లో ఇప్పటివరకు 1128 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఇప్పుడు అది 1440కి పెరిగింది.
విశాఖపట్నం-సికింద్రాబాద్(20833) రైలు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. ఇది సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 2.20 గంటలకు చేరుకుంది. ఇక తిరుగు ప్రయాణంలో 20834 నెంబర్‌తో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. రాత్రి 11.3 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆక్సుపెన్సీ సరిపోవడం లేదు. దీంతో కోచ్‌ల సంఖ్యను పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ పరిశీలించి కోచ్‌ల సంఖ్యను పెంచింది. దీంతో మరింత మంది ప్రయాణించడానికి వీలు కలుగుతుంది.
విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయి. గత ఏడాది సికింద్రాబాద్-విశాఖపట్నం(20707-20708) రైలుకు కూడా కోచ్‌ల సంఖ్యను పెంచారు. గతంలో 16 కోచ్‌లు ఉండగా.. 20కి పెంచారు. దీంతో 18 ఏసీ చైర్ కార్ కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలు ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. దీంతో సికింద్రాబాద్-విశాఖ రూట్లో ప్రయాణించేవారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అటు విశాఖలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం రూ.300 కోట్లతో మెయింటెన్స్ డిపో ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. త్వరలోనే దీనికి అడుగుల పడనున్నాయి.