తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో రూ.2వేల కోట్లు కోట్లు బయటపడ్డ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత వారం రోజులుగా జరిగిన ఐటీ దాడులపై.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. “పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే… ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?” అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే… ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? @ncbn
— Sajjala RamaKrishna Reddy (@SRKRSajjala) February 13, 2020