‘అంతర్వేది’ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ అంతర్వేది లక్ష్మీనరసింహా స్వామి పుణ్యక్షేత్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు కరోనా బారిన పడ్డారు

అంతర్వేది విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా

Edited By:

Updated on: Sep 14, 2020 | 10:03 AM

Antarvedi Police Corona: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ అంతర్వేది లక్ష్మీనరసింహా స్వామి పుణ్యక్షేత్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు కరోనా బారిన పడ్డారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గాశేఖర్ రెడ్డి సహా మరో 10 మంది పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఎస్పీ వెల్లడించారు. తామంతా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తాము చికిత్స పొందుతున్నట్లు వివరించారు. కాగా అంతర్వేదిలో ఇటీవల రథం దగ్ధం కాగా.. అప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అంతర్వేదిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే రథం దగ్ధానికి నిరసనగా బీజేపీ, హిందూ సంఘాలు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 36 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు పరీక్షలు చేయించుకోగా.. వారిలో పలువురికి కరోనా సోకినట్లు తేలింది.

Read More:

తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా 1,417 కేసులు

వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన మరాఠీ చిత్రం