ఈ ఆగష్టు 15కు ఖైదీల విడుదల లేనట్లేనా!

| Edited By:

Aug 13, 2020 | 1:02 PM

సాధారణంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగష్టు 15న విడుదల చేసే విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది వారి విడుదల ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తోంది

ఈ ఆగష్టు 15కు ఖైదీల విడుదల లేనట్లేనా!
Follow us on

Prisoners in Telangana: సాధారణంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగష్టు 15న విడుదల చేసే విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది వారి విడుదల ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తోంది. మామూలుగా విడుదల చేసే ఖైదీల పేర్లను ఈ పాటికే ఖరారు చేయాల్సి ఉండగా.. ఆ జాబితా ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. ఈ నెలాఖరుకు గానీ వచ్చే నెల మొదటి వారంలోగానీ జాబితా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ జాబితా రూపకల్పనలో అధికారులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి జాబితాను తయారుచేస్తారు. ఇందులో తీవ్ర నేరాలు, రిపీటెడ్‌ అఫెండర్స్‌ను అసలు పరిగణనలోకి తీసుకోరు. అలాగే లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డ వారిని కూడా పరిగణించరు.

Read This Story Also: మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై కేసు నమోదు