“తొలకరి కురిసింది… నేల నవ్వింది…” తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి

తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరించింది. నింగి నుంచి నేలకు నీటి వంతెనలు వేస్తున్నట్లగా కురిసింది తొలకరి వాన. ఉక్కపోతతో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జనం ఇబ్బందులు పడ్డారు. అదే సాయంత్రం మొదలైన ముసురు బుధవారం కూడా కొనసాగుతోంది...

తొలకరి కురిసింది... నేల నవ్వింది... తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి

Updated on: Jun 10, 2020 | 9:04 AM

తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరించింది. నింగి నుంచి నేలకు నీటి వంతెనలు వేస్తున్నట్లగా కురిసింది తొలకరి వాన. ఉక్కపోతతో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జనం ఇబ్బందులు పడ్డారు. అదే సాయంత్రం మొదలైన తొలకరి జల్లులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాలో చల్లని గాలులతో కూడిన ముసురు కొనసాగుతోంది.

ఈ నెల‌ 1న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దాటుతూ తెలంగాణ వైపు పయనిస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్‌, తమిళనాడు తదితర ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ భారీగా నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

బుధవారం నాటికి మహారాష్ట్ర, కర్ణాటక లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మంగళవారం తెలంగాణ రాష్ట్రం లోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. బుధవారం నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తుండటంతో చాలా చోట్ల తొలకరి జలలు కురియనున్నట్లు తెలిపారు.