అంతర్వేది రథం దగ్ధం.. దోషులకు కఠిన శిక్ష తప్పదన్న మంత్రి

| Edited By:

Sep 06, 2020 | 11:54 AM

ప్రసిద్ధ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 60ఏళ్ల నాటి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి దాటిన తరువాత చెలరేగిన మంటలతో ఈ రథం కాలిపోయింది

అంతర్వేది రథం దగ్ధం.. దోషులకు కఠిన శిక్ష తప్పదన్న మంత్రి
Follow us on

Antervedi Chariot Fire: ప్రసిద్ధ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 60ఏళ్ల నాటి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి దాటిన తరువాత చెలరేగిన మంటలతో ఈ రథం కాలిపోయింది. దీంతో స్థానికులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి మాట్లాడారు. 60 ఏళ్ల నాటి రథం దగ్ధం అవ్వడం చాలా బాధాకరమని అన్న ఆయన.. ఈ ఘటనపై విచారణ చేయటానికి దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ని నియమించినట్లు తెలిపారు. ఇది దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రేపే అక్కడ నూతన రథం నిర్మాణం చేస్తామని వెల్లంపల్లి వివరించారు. ఇక ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటు అయ్యిందని.. మతాలను కూడా రాజకీయానికి వాడుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. దేవాదాయ శాఖకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖాజానాకు వెళ్లదని.. ప్రభుత్వం కూడా తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఎంపీ రఘురామకృష్ట రాజు మాటలు అర్ధరహితమని, బుద్ది ఙ్ఞానం ఉన్న వాళ్లు దేవుళ్ల మీద రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి సూచించారు. హిందు దేవాలయం మీద అవాస్తవాలు మాట్లాడితే రఘురామకృష్ట రాజు మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More:

సినిమాలు చాలు.. రాజకీయాల్లోకి రండి

దేశంలో క‌రోనా క‌ల్లోలం : తొలిసారిగా 90వేల‌కు పైగా కేసులు