విదేశాలకు చేపలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే-మంత్రి కేటీఆర్

|

Jun 23, 2020 | 1:55 PM

సిరిసిల్ల జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ. 5.15 కోట్లతో సిరిసిల్లలో అధునాతన రైతు బజార్‌ను...

విదేశాలకు చేపలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే-మంత్రి కేటీఆర్
Follow us on

minister KTR launches :  సిరిసిల్ల జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ. 5.15 కోట్లతో సిరిసిల్లలో అధునాతన రైతు బజార్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో కాసేపు ముచ్చటించారు.

ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. రోహిణి కార్తెలో కూడా చెరువులు నింపడం ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మూడేండ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టనుందన్నారు. నీలి విప్లవంతో విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

కొంతమంది నియంత్రిత సాగుకు వక్ర భాష్యం చెప్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు ఎగ్గొడతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదన్నారు. కల్నల్ సంతోష్ బాబును కేసీఆర్ ఆదుకుంటే… కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వి కేసీఆర్ ను అభినందించారని గుర్తు చేశారు.