
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులు హాజరయ్యారు.
జల విప్లవంతో తెలంగాణలో గ్రీన్, పింక్, వైట్, బ్లూ రివల్యూషన్ కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. నూతన పెట్టుబడులతో రైతులకు సైతం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి అత్యంత సౌకర్యవంతమని వెల్లడించారు. భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండటం వల్ల అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు.