తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌..

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అన్నారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌‌లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సన్నాహక బహిరంగ సభలో.. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని.. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. పెన్షన్ల కోసం ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. ఆర్థిక మాంద్యం ఉన్నా.. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ పథకాలకు నిధులు […]

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌..
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 12:31 AM

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అన్నారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌‌లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సన్నాహక బహిరంగ సభలో.. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని.. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. పెన్షన్ల కోసం ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. ఆర్థిక మాంద్యం ఉన్నా.. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ పథకాలకు నిధులు ఆపొద్దని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుందని.. అదే టీఆర్ఎస్ అధిష్టానం తెలంగాణ గల్లీలో ఉంటుందన్నారు.

ఇక జవహర్‌నగర్ అంటే నా గుండెకాయ వంటిందంటూ మంత్రి మల్లారెడ్డి అన్నారు. జవహర్ నగర్‌ను ఓ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని.. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డంపింగ్ యార్డ్‌ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. దీంతో సమీప ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ డంపింగ్ యార్డ్‌కు రూ.144 కోట్ల ఖర్చుతో క్యాపింగ్ పనులు చేపడుతుందని తెలిపారు.

కాగా, బహిరంగ సభకు ముందు మంత్రి హరీష్ రావు‌ సహచర మంత్రి మల్లారెడ్డితో కలిసి బాలాజీనగర్‌లో ప్రధాన రహదారి వెంట రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??