ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

|

Jun 05, 2020 | 11:28 AM

ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, ఝార్ఖండ్‌లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఉదయం 6.55 గంటలకు భూకంపం వచ్చింది.

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు
Earthquake
Follow us on

ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. (05 జూన్) ఈ ఉదయం 10.15 నిమిషాలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఒంగోలులోని శర్మ కళాశాల, అంబేడ్కర్ భవన్, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు, గద్దలగుంట, మామిడపాలెం, దేవుడిచెరువు ప్రాంతాల్లో స్పల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిసెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, ఝార్ఖండ్‌లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 6.55 నిమిషాలకు భూకంపం వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. హంపీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది.