గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయ్యింది. నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఈ కార్యాలయం ఉండగా.. ఇటీవల యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా భవన యజమాని టూలెట్ బోర్డును పెట్టాడు. ఇక ఈ ఆఫీసును బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని యజమాని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమి అనంతరం పలువురు నాయకులు ఆ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే.