కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయ విదారకంః ప‌వ‌న్ క‌ళ్యాణ్

| Edited By:

Aug 09, 2020 | 12:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో తెల్ల‌వారు జామున‌ భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది. దీనిని కరోనా రోగుల కేర్‌ సెంటర్‌గా..

కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయ విదారకంః ప‌వ‌న్ క‌ళ్యాణ్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో తెల్ల‌వారు జామున‌ భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది. దీనిని కరోనా రోగుల కేర్‌ సెంటర్‌గా ఉపయోగిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పీఎం న‌రేంద్ర మోదీ కూడా సీఎం జ‌గన్‌కి ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక ఇదే విష‌యంపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌డుతూ.. 11 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాద బారినపడటం అత్యంత విషాదం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

రమేశ్ హాస్పిట‌ల్స్‌కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలి. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు.

Read More:

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు

ప్రిన్స్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ః ‘స‌ర్కారు వారి పాట’ మోష‌న్ పోస్ట‌ర్ అదిరింది