INS Rajput decommissioned at Visakha Naval Dockyard : భారతదేశ మొట్ట మొదటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్ కి వీడ్కోలు పలికారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్ లో తూర్పు నావికాదళం శుక్రవారం సూర్యాస్తమయ సమయంలో ఈ వీడ్కోల కార్యక్రమం నిర్వహించింది. రాజ్ పుత్ యుద్ధ నౌక నుంచి జాతీయ జెండా, నేవల్ ఎంసైన్ ని అవనతం చేసి అధికారులు వీడ్కోలు తెలిపారు. ఈ సెండాఫ్ కార్యక్రమానికి తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 41 సంవత్సరాల పాటు దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన ఐ ఎన్ ఎస్ రాజ్ పుత్.. మొత్తంగా సాగర జలాల్లో 7, 87,194 నాటికల్ మైళ్ళు ప్రయాణం చేసింది. అంటే ఇది దాదాపుగా భూమిని 36.5 సార్లు, భూమి నుంచి చంద్రగ్రహానికి 3.8 సార్లు ప్రయాణించిన దూరంతో సమానం. కాగా, భారత నావికాదళంలో తొలి తరం శత్రు నౌకల విధ్వంసక నౌక ఇది. పూర్వపు సోవియట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా (యుఎస్‌ఎస్‌ఆర్) నిర్మించిన కాషిన్-క్లాస్ డిస్ట్రాయర్ల కోవకు చెందిన ప్రధాన నౌక ఈ ‘ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్’. 1980 మే 4న ఇది తన సర్వీస్‌ను ప్రారంభించింది. నికోలెవ్ (ప్రస్తుత ఉక్రెయిన్)లోని 61 కమ్యునార్డ్స్ షిప్‌యార్డ్‌లో ఇది తయారైంది. దీని అసలు రష్యన్ పేరు ‘నాదేజ్నీ’ అంటే ఆశ ‘హౌప్’ అని అర్థం.
4 మే 1980న జార్జియాలోని పోటిలో యూఎస్ఎస్ఆర్‌లో అప్పటి భారత రాయబారి ఐకే గుజ్రాల్.. కెప్టెన్ గులాబ్ మోహన్‌లాల్ హీరానందనితో కలిసి దీనిని ప్రారంభించారు. ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌కు గులాబ్ తొలి కమాండింగ్ అధికారి. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఇది దేశానికి ఎనలేని సేవలు చేసింది. దేశాన్ని భద్రంగా ఉంచడంలో ఈ నౌక ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. వీటిలో కీలకమైనవి.. ఐపికెఎఫ్‌కు సహాయపడటానికి ఆపరేషన్, అండమాన్ – శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల నుండి తాకట్టు పరిస్థితిని పరిష్కరించడానికి ఆపరేషన్ కాక్టస్, లక్షద్వీప్ నుండి ఆపరేషన్ క్రోవ్‌నెస్ట్ తదితరాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఓడ అనేక ద్వైపాక్షిక, బహుళ-జాతీయ ఎక్సర్ సైజెస్ లో పాల్గొంది. ఈ నౌక భారత ఆర్మీ రెజిమెంట్‌తో అనుబంధంగా ఉండి.. 2019 ఆగస్టు 14న చివరిగా బాధ్యతలు నిర్వహించింది. ఇక.. ఈ ఓడ కోసం 31 కమాండింగ్ అధికారులు పనిచేసేవారు.
Read also : Telangana Lockdown : తెలంగాణలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు