Andhra Pradesh: సాయి ప్రియ అడ్డగోలు వ్యవహారంపై ఇండియన్ నేవీ సీరియస్ అయింది. ఒక తప్పుడు సమాచారం కారణంగా.. అత్యంత ఖర్చుతో కూడిన మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్‌ను రెస్క్యూకి వినియోగించామని నేవీ మండిపడింది. అందరినీ తప్పు దోవ పట్టించిన సాయి ప్రియపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని.. నగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు జీవీఎంసీ కమిషనర్‌కి ఫిర్యాదు చేసింది నేవీ. ఎంతో విలువైన ప్రజాధనం, సమయం వృధా అయ్యాయని అవేదన వ్యక్తం చేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయవద్దని పోలీసులకు సూచించింది. ఆర్కే బీచ్(RK Beach)లో తన భార్య అలల్లో కొట్టుకుపోయిందంటూ.. సాయి ప్రియ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, అధికారులు ఆ మేరకు సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఆపై అదంతా డ్రామా అని తేలింది. భర్త కళ్లుగప్పి.. ప్రియుడు రవితో జంప్ అయ్యింది సాయి ప్రియ. ప్రియుడిని పెళ్లి చేసుకుని… తాజాగా వైజాగ్‌లోని ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు సాయి ప్రియ వచ్చింది. తప్పు చేసినందకు మన్నించమని అధికారులను కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. పోలీసులు సాయిప్రియ, రవి పేరెంట్స్‌తో పాటు భర్త శ్రీనివాస్‌కు సైతం కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే వారు చేసిన పని.. తమను కృంగదీసిందని.. వారిని ఇళ్లకు రానివ్వమని పేరెంట్స్ స్పష్టం చేశారు. పేరెంట్స్‌తో కాకుండా తామిద్దరం కలిసి వేరుగా ఉంటామని సాయిప్రియ, రవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా పారిపోయిన 2 రోజులు ఖర్చుల నిమిత్తం.. ఆమె భర్త వెడ్డింగ్ డే రోజు బహుమతిగా ఇచ్చిన గాజులు అమ్మడం గమనార్హం.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..