బ్రేకింగ్.. విజయవాడ కరోనా కేర్‌ సెంటర్‌ భారీ అగ్ని ప్రమాదం

| Edited By:

Aug 09, 2020 | 6:59 AM

ఏపీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు..

బ్రేకింగ్.. విజయవాడ కరోనా కేర్‌ సెంటర్‌ భారీ అగ్ని ప్రమాదం
Follow us on

ఏపీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది. దీనిని కరోనా రోగుల కేర్‌ సెంటర్‌గా ఉపయోగిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అందులో 40 మంది ఉన్నారని.. అందులో ముప్పై మంది కరోనా సోకిన వారు కాగా.. మరో పది మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్లు సమాచారం. బాధితులందర్నీ అంబులెన్స్‌లో ఇతర ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు