రైతుల ధర్నా.. ఆర్మూర్‌లో ఉద్రిక్తత

| Edited By:

Feb 16, 2019 | 1:18 PM

నిజామాబాద్: ఆర్మూర్‌లో రైతులు ధర్నా చేపట్టారు. నిర్మల్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు.. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని అంటున్నారు. రైతుల ఆందోళనను విరమింపజేసేందుకు సీపీ కార్తికేయ రంగంలోకి దిగారు. అక్కడున్న రైతులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ చుట్టూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. అయితే పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, ఎర్ర జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన […]

రైతుల ధర్నా.. ఆర్మూర్‌లో ఉద్రిక్తత
Follow us on

నిజామాబాద్: ఆర్మూర్‌లో రైతులు ధర్నా చేపట్టారు. నిర్మల్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు.. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని అంటున్నారు. రైతుల ఆందోళనను విరమింపజేసేందుకు సీపీ కార్తికేయ రంగంలోకి దిగారు. అక్కడున్న రైతులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ చుట్టూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. అయితే పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, ఎర్ర జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అర్మూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.