ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

| Edited By:

Mar 16, 2019 | 10:51 AM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగర్లో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు(45) వ‌ృత్తిరీత్యా బెంగులూరులోని ఓ హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. కుటుంబసభ్యులు షాపును నిర్వహిస్తూ అల్లినగరంలో ఉంటున్నారు. అయితే.. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు […]

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
Follow us on

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగర్లో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు(45) వ‌ృత్తిరీత్యా బెంగులూరులోని ఓ హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. కుటుంబసభ్యులు షాపును నిర్వహిస్తూ అల్లినగరంలో ఉంటున్నారు. అయితే.. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు భార్య ఈశ్వరి, పిల్లలు వైష్ణవి, వరలక్ష్మి.