కరోనా రోగుల కోసం పోలీసుల సాహసం.. ఏపీ డీజీపీ ప్రశంసలు

| Edited By:

Aug 24, 2020 | 5:19 PM

ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.

కరోనా రోగుల కోసం పోలీసుల సాహసం.. ఏపీ డీజీపీ ప్రశంసలు
Follow us on

DGP praises AP Police: ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతాల నుంచి కరోనా రోగులను ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ముందడుగు వేశారు. అమలాపురం సబ్ డివిజన్‌లోని దొబ్బవరం అనే గ్రామంలోకి వరద నీరు పూర్తిగా చేరడంతో.. బోట్లు వేసుకొని వెళ్తోన్న జిల్లా పోలీసులు అక్కడి రోగులను కరోనా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ వారిని అభినందించారు. కరోనా వేళ మానవత్వం చూపుతున్న వారిని డీజీపీ అభినందించారని ఏపీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ట్వీట్ వేశారు.

Read More:

సినీ పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

రియా వచ్చినప్పటి నుంచి మేమిద్దరం పెద్దగా మాట్లాడుకోలేదు