కరోనా ఎఫెక్ట్‌.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు

| Edited By:

Oct 05, 2020 | 9:53 AM

అన్‌లాక్‌లో భాగంగా దాదాపుగా అన్ని రంగాలు తిరిగి తమ పనులను ప్రారంభిస్తుండగా.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది

కరోనా ఎఫెక్ట్‌.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు
Follow us on

Devaragattu Bunny Ustavam: అన్‌లాక్‌లో భాగంగా దాదాపుగా అన్ని రంగాలు తిరిగి తమ పనులను ప్రారంభిస్తుండగా.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే అన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో అధికారులు కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్‌ జిల్లా దేవరగట్టులో కర్రల సమరం అలియాస్ బన్నీ ఉత్సవాన్ని అధికారులు రద్దు చేశారు.

కాగా కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో మాలమల్లేశ్వరస్వామి కొలువైన దేవరగట్టులో ప్రతి ఏటా బన్నీ ఉత్సవాలు జరుగుతుంటాయి.  దసరా రోజున కల్యాణోత్సవం అనంతరం స్వామి వారిని ఊరేగిస్తారు. ఉత్సవ మూర్తులను మేళతాళాలతో కొండ దిగువన సింహాసన కట్టకు చేరుస్తారు. అక్కడే కట్టల ఉత్సవం ప్రారంభం అవుతుంది. ఆచారంలో భాగంగా ఉత్సవమూర్తులను తమ వశం చేసుకునేందుకు ఒక వర్గం కర్రల యుద్ధానికి సిద్ధమవుతుంది. మరో వర్గం ఆ విగ్రహాలను ఎవరూ తీసుకొని పోకుండా చుట్టూ గుంపులుగా ఏర్పడి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సుమారు 11 గ్రామాల ప్రజలు ఈ పోటీలో పాల్గొంటారు. అర్ధరాత్రితో మొదలై పొద్దుపోయేవరకు ఈ ఉత్సవం కొనసాగుతుంది. ఆ తరువాత ఉత్సవమూర్తులను అడవుల్లోకి తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తారు. అక్కడే స్వామి భవిష్యవాణి చెప్పగా, అక్కడితో ఈ ఉత్సవం ముగియనుంది. ఈ ఉత్సవంలో స్వామిదర్శనం కోసం ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా వస్తుంటారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

Bigg Boss 4: ఆ ఆరుగురిని టెన్షన్ పెట్టి, కూల్‌ చేసిన నాగార్జున