AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నవంబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోండి

CSIR UGC NET డిసెంబర్‌ 2026 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సైన్స్‌ విభాగాల్లో జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 5, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ముఖ్యమైన తేదీల వివరాలు తెలుసుకోండి..

CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నవంబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోండి
CSIR UGC NET December Notification
Srilakshmi C
|

Updated on: Oct 09, 2026 | 6:30 AM

Share

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధన రంగాల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ (CSIR UGC NET) డిసెంబర్‌ 2026 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతతో పాటు పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 5, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష వివరాలు

  • పరీక్ష పేరు: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2026
  • నిర్వహణ సంస్థ: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)
  • పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)
  • ప్రశ్నల విధానం: మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (MCQs)
  • మొత్తం మార్కులు: 200
  • పరీక్ష వ్యవధి: 3 గంటలు
  • అందుబాటులో ఉన్న సబ్జెక్టులు

ఈ పరీక్షను ఐదు సైన్స్‌ విభాగాల్లో నిర్వహిస్తారు.

  • కెమికల్‌ సైన్సెస్‌ (Chemical Sciences)
  • ఎర్త్‌, అట్మాస్ఫియరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌ (Earth, Atmospheric, Ocean and Planetary Sciences)
  • లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ బయోటెక్నాలజీ (Life Sciences and Biotechnology)
  • మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ (Mathematical Sciences)
  • ఫిజికల్‌ సైన్సెస్‌ (Physical Sciences)

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఓబీసీ (నాన్‌-క్రీమీలేయర్‌), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హతలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత కేటగిరీకి వర్తించే విద్యార్హతలు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అలాగే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF)కు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు డిసెంబర్‌ 2026 నాటికి గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్‌-క్రీమీలేయర్‌) అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ ప్రవేశాలు విభాగాలకు గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.1150, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ / ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్ధులు రూ.600, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / థర్డ్‌ జెండర్‌ అభ్యర్దులు రూ.325 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని, నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా అప్లికేషన్‌ కాపీని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌ 5, 2026.
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్‌ 5, 2026.
  • దరఖాస్తు వివరాల సవరణ: నవంబర్‌ 10 నుంచి 12, 2026 వరకు
  • రూ.500 అదనపు రుసుముతో దరఖాస్తుకు పేర్కొన్న గడువు: నవంబర్‌ 6 నుంచి 9, 2026

CSIR UGC NET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!