Ganja: విశాఖ ఏజెన్సీలో పట్టుబడ్డ కోటి రూపాయల విలువైన గంజాయి

|

Sep 22, 2021 | 2:08 PM

విశాఖ ఏజెన్సీలో కోటి విలువైన భారీగా గంజాయి పట్టుబడింది. అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి..

Ganja: విశాఖ ఏజెన్సీలో పట్టుబడ్డ కోటి రూపాయల విలువైన గంజాయి
11
Follow us on

Ganja – Visakha Agency: విశాఖ ఏజెన్సీలో కోటి విలువైన భారీగా గంజాయి పట్టుబడింది. అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వెళ్తోన్న వ్యాన్ ను అడ్డుకున్నారు. తనిఖీలు చేయగా గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. హర్యానా, యూపీకి చెందిన ఇద్దరు స్మగ్లర్లులను పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. వ్యాన్ సహా 620 కిలోల గంజాయి సీజ్ చేశారు. ఒడిశా పాడువా నుంచి గంజాయిని హర్యానాకు తరలిస్తున్నట్టు విచారణలో తేల్చారు.

లాడ్జిలో డర్టీ పిక్చర్:

కర్నాటకలోని తుముకూరు సమీపంలోని జాతీయ రహదారి. రయ్‌ రయ్‌ మంటూ వాహనాలు దూసుకెళ్లే ఈ హైవేపై ఉన్నట్టుండి కండోమ్స్‌ కలకలం రేపాయి. కుప్పలు తెప్పలుగా.. గుట్టలు గుట్టలుగా కండోమ్స్‌ చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. ఆనోటా ఈనోటా సమాచారం అందుకున్న పోలీసులు.. కండోమ్స్ కథా చిత్రమ్‌పై నజర్‌ పెట్టారు. చుట్టుపక్కల ఇళ్లేవి లేవు.. అయినా ఇవి ఇక్కడి కండోమ్స్‌ ఎలా వచ్చాయని బేజా ఫ్రై చేసుకున్నారు పోలీసులు. ఇవీ ఇక్కడికి ఎలా వచ్చయన్న దానిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

పోలీసుల విచారణలో భాగంగా సమీపంలో ఉన్న నంది డీలక్స్‌ లాడ్జి దగ్గర పోలీసులు ఆగిపోయారు. లోపలికి వెళ్లి షరామూమూలుగానే లాడ్జి సిబ్బందిని ప్రశ్నించారు. వాళ్లపై అనుమానం రావడంతో తమదైన స్టయిల్‌లో ప్రశ్నించారు. దీంతో లాడ్జీలో వయా టన్నెల్‌ డర్టీ పిక్చర్‌ బయటపడింది. పైకి నీట్‌గా కనిపిస్తున్న ఈలాడ్జీలో సొరంగంలో వ్యభిచారం బాగోతం బయటపడింది. దీంతో అడ్డుపెట్టిన టేబుల్ చక్కలను తొలగించి చూస్తే.. ఓ జంట మెల్లగా పాక్కుంటూ బయటపడింది. వారిద్దరితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read also: Hyderabad: హైదరాబాద్‌లోని టోలీచౌకీలో దారుణ హత్య..