AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 72 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,753కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,516 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,09,975కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 1112, చిత్తూరులో 755, గుంటూరులో 152, తూర్పు గోదావరిలో 1351, గుంటూరులో 868, కడపలో 604, కృష్ణాలో 363, కర్నూలులొ 1285, నెల్లూరులో 788, ప్రకాశంలో 366, శ్రీకాకుళంలో 682, విశాఖలో 781, విజయనగరంలో 575, పశ్చిమ గోదావరిలో 798 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.
Read This Story Also: టీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంప్ ఔట్‌లెట్లు ప్రారంభం
#COVIDUpdates: As on 6th August, 10:00 AM
COVID Positives: 1,93,894
Discharged: 1,09,975
Deceased: 1,753
Active Cases: 82,166#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gWytwJYQVq— ArogyaAndhra (@ArogyaAndhra) August 6, 2020