హైదరాబాద్ కు కేంద్ర బలగాలు…! క్లారిటీ ఇచ్చిన డీజీపీ

కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ కు కేంద్ర బలగాలు వస్తున్నాయని, వచ్చాయనే వార్తలు వచ్చాయి.. అయితే...

హైదరాబాద్ కు కేంద్ర బలగాలు...! క్లారిటీ ఇచ్చిన డీజీపీ

Updated on: Mar 28, 2020 | 12:54 PM

కరోనా నియంత్రణకు కేంద్ర బలగాలు తెలంగాణకు వస్తున్నాయనే వార్తల్లో నిజం లేదని తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలను కొట్టిపారేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. రాష్ట్రానికి కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్‌, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. ఆశావ‌ర్క‌ర్లు, ఏఎన్ఎమ్‌లు అనారోగ్యంతో ఉన్నవారి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. వైర‌స్‌ అనుమానీత వ్య‌క్తుల‌కు ఎప్పటిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీనికి సంబందించిన‌ దృశ్యాలు కూడా వివిధ మీడియాల్లో ప్రసారం చేసిన సంగ‌తి తెలిసిందే.