ట్రావెల్ బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

| Edited By:

May 06, 2019 | 11:30 AM

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట వద్ద అదుపుతప్పి రమణ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో సుమారు 10మంది చిన్నపిల్లలు ఉండగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా బస్సు యానాం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు […]

ట్రావెల్ బస్సు బోల్తా.. 30మందికి గాయాలు
Follow us on

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట వద్ద అదుపుతప్పి రమణ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో సుమారు 10మంది చిన్నపిల్లలు ఉండగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా బస్సు యానాం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.