వేటకొడవళ్లతో ప్రత్యర్థులు దాడులు చేసుకోవడం సీమలో అప్పుడప్పుడు చూస్తూంటాం. అలాంటి సీనే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో రిపీట్ అయ్యింది. పట్టపగలు రోడ్డుపై ఓ యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.
వేములవాడ టౌన్‌లోని సుబ్రమణ్య నగర్‌కు చెందిన నాగులు రవి అనే వ్యక్తి.. ఓ యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పారు.. యువతికి పెళ్లి చేశారు.
కాగా.. యువతి భర్త ఉపాధికోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో అమ్మాయి పేరెంట్స్.. మాజీ ప్రియుడు రవి ఉన్న ఏరియాలోనే అద్దెకు దిగారు. మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు.. సమయం కోసం వేచి చూశారు. ఇంటి వెనుక నుంచి బైక్‌పై రవి వెళ్లడం గమనించారు. వెనుక నుంచి వచ్చిన ముగ్గురు యువకులు కత్తితో.. కసితీరా నరికి చంపారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ ద్వారా.. పీడీయాక్ట్ కింద కేసు నమోదు పోలీసులు చేశారు. హత్య చేసిన వాళ్లని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.