Vizag: వంతెన పైనుంచి నీటిలో పడ్డ ఆటో డ్రైవర్.. ఆ తరువాత..

| Edited By: Ram Naramaneni

Oct 16, 2023 | 5:44 PM

ఓ ఆటో ప్రయాణికులతో వెళుతుంది.. అక్కడ ఒక చిన్నపాటి వంతెన ఉంది. ఎదురుగా మరో ఆటో.. అదుపుతప్పి ఢీకొన్నాయి. ఒక ఆటో ఫ్రంట్ గ్లాస్ ధ్వంసం అయింది. ఆ గ్లాస్‌లో నుంచి డ్రైవర్ కింద పడ్డాడు. ఏకంగా వంతెనపై నుంచి నీటిలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాాం పదండి.. 

Vizag: వంతెన పైనుంచి నీటిలో పడ్డ ఆటో డ్రైవర్.. ఆ తరువాత..
Accident
Follow us on

విశాఖలో ఓ ప్రమాదం… రెండు ఆటోల్లో ప్రయాణిస్తున్న వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో.. ఓ ఆటో డ్రైవర్ వంతెన పైనుంచి సముద్రపు నీటిలో పడిపోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలుకు గాయాలయ్యాయి. డాక్ యార్డ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది. రెండు ఆటోలు ఢీకొన్న సమయంలో ఓ ఆటో ఫ్రంట్ అద్దాలు పగిలిపోయి డ్రైవర్ కింద పడ్డాడు. ఏకంగా వంతెనపై నుంచి నీటిలో పడ్డాడు. ఈత రావడంతో సేఫ్‌గా బయటపడ్డాడు. అందరూ సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.

అలా జరిగింది.. నీటిలో పడిన ఆ డ్రైవర్ ఈదుకుంటూ..

విశాఖలో.. ఓ ఆటో నగరంలో ప్రయాణికులను ఎక్కించుకొని.. వయా డాక్ యార్డ్ మీదుగా మల్కాపురం వెళుతుంది. మరో ఆటో గంగవరం నుంచి ఫిషింగ్ హార్బర్‌కు చేపల కోసం బయలుదేరింది. డాక్ యార్డ్ సమీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన పైకి వచ్చేసరికి.. ఆటో అదుపుతప్పి మరో ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదం దాటికి.. ఆటో అద్దాల పగిలి డ్రైవర్ వంతెన పైనుంచి నీటిలో పడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. నీటిలో పడ్డ ఆటోడ్రైవర్ ఈదుకుంటూ గట్టుకు చేరిపోయాడు. మరో ప్రయాణికురాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ప్రణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ అతి వేగం ఎప్పటికీ మంచిది కాదని పోలీసులు చెబుతున్నారు. డ్రైవింగ్ చేసే వాళ్లు అన్ని నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..