AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC 163 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

రాష్ట్రంలో గ్రూప్‌ 1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, డీఈఓ, ఆర్టీవో, మున్సిపల్‌ కమిషనర్‌ తదితర కీలక పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6, 2026 నుంచి ప్రారంభమై అక్టోబర్‌ 27 వరకు కొనసాగనుంది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC 163 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!
APPSC Group 1 Recruitment Notification
Srilakshmi C
|

Updated on: Sep 15, 2026 | 11:21 AM

Share

అమరావతి, సెప్టెంబర్ 15: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మంగళవారం (సెప్టెంబర్ 15) ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 163 గ్రూప్‌ 1 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6, 2026 నుంచి మొదలవనుంది. అక్టోబర్ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అంటే ఆఫ్‌లైన్‌ (పెన్ను, పేపర్‌) విధానంలో పరీక్ష ఉంటుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ద్వారా భర్తీ చేసే సర్వీసులు ఇవే..

  • డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య: 11
  • ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్ పోస్టుల సంఖ్య: 14
  • డీఎస్పీ సివిల్‌ పోస్టుల సంఖ్య: 36
  • డీఎస్పీ కమ్యూనికేషన్స్‌ పోస్టుల సంఖ్య: 3
  • డీఈవో పోస్టుల సంఖ్య: 14
  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
  • ఆర్టీవో పోస్టుల సంఖ్య: 3
  • డిప్యూటీ రిజిస్టర్‌ కోఆపరేటివ్‌ సర్వీసెస్‌ పోస్టుల సంఖ్య: 15
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 12
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 2
  • డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 14
  • డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 35

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అలాగే మరో 20 శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి ఈ నెల 24న ప్రత్యేకంగా మరో ప్రకటన వెలువడనుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతాయి. 5 శాఖలకు సంబంధించి పోస్టులకు బుధవారం (సెప్టెంబర్ 16) నోటిఫికేషన్ వెలువడనుంది. 10 శాఖలకు సంబంధించి పోస్టులకు సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని కమిషన్ సూచించింది.

Follow Us